Millets And Their Health Benefits Reduces Disease In Telegu
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కొర్రలు
ఊబకాయంతో బాధపడేవారు.. వీటిని అన్నంలా వండుకుని తినడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది. మంచి బలవర్దకమైన ఈ ఆహారంపై ప్రతిఒక్కరికీ అవగాహన పెరిగింది. దీనివల్ల చాలామంది కొర్రలతో వంటచేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా.. చిన్నారులు, గర్భిణీలకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా ఉద సంబంధ వ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం, రక్తస్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
సామలు
ఇందులో కూడా ఎక్కువగా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అదనపు శక్తి ఖాయం. అజీర్తి సమస్యలు దూరం చేసుకోవచ్చు. అదే విధంగా మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతుంది. తీయ్యగా ఉండే వీటిన తీసుకోవడం వల్ల మాంసకృత్తులు పొందినవారవుతాం.
రాగులు
కాల్షియం అధికంగా ఉండే రాగులు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి చల్లదనం ఇస్తాయి. బీ కాంప్లెక్స్ అధికంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మారాయి. బాలింతలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు, వీటిని తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ దూరంగా ఉండొచ్చు.
అరికెలు
ప్రోటీన్స్, కొవ్వుపదార్థాలు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల శక్తి మీ సొంతమవుతుంది.
ఊదలు
వీటిని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఊదలు మంచి ప్రయోజనాలనిస్తాయి. కూర్చొని పనిచేసేవారికి ఇది చక్కని ఆహారం.
అవిసెలు
పోషకాలు అధికంగా ఉండే వీటివల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల సక్రంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను ఇవి అదుపులో ఉంచుతాయి. అదే విధంగా.. నెలసరి సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. మధుమేహ వ్యాధిగ్రస్థులు వీటిని తరచుగా తీసుకోవడం చాలా మంచిది.