Tuesday, May 31, 2022

Nitheen Kumar

జుట్టు సంరక్షణ కోసం వేప నూనె

జుట్టు సంరక్షణ కోసం వేప నూనె

Amazing Benefits of Neem Oil for Hair Growth

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యక్తిగత సంరక్షణ చాలా అవసరం. రోజువారీ సంరక్షణ అనగానే మనకు తోచే మొదటి విషయం ఆయుర్వేదం. మన భారతదేశం ఆయుర్వేదం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన దేశం. ఎన్నో మూలికలు లభించే దేశమిది. ప్రతి చెట్టు, వాటి యొక్క ఆకులూ మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎందరో ఉండే వారు. ఇంగ్లీష్ మందులు సులభంగా లభించటం వలన కాలం మారే కొద్ది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ అటువంటి పరిస్థితులు మారి ప్రస్తుత జనరేషన్ లోని యువతీ యువకులు మన ప్రాచీన పద్ధతులను అనుసరించటం మల్లీ మొదలు పెట్టారు.

Amazing Benefits of Neem Oil for Hair Growth
Amazing Benefits of Neem Oil for Hair Growth

మన ఆయుర్వేదంలో ఆరోగ్యం కొరకు అలాగే సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందిన మూలికల్లో ఒకటి ‘వేప’. అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో వేప చెట్టు లేని వీధి ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో గ్రామాలలో వీధికి కనీసం ఒక వేప చెట్టుని చూస్తూనే ఉంటాము. మన తెలుగు సంప్రదాయంలో వేపాకు చెట్టు అనగానే గుర్తొచ్చేది ఉగాది. ఉగాది పచ్చడి చేసేందుకు వేప పూలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు వేప పూలనే కాదు వేప ఆకులూ మరియు చిన్న చిన్న వేప కాడలను కూడా ఉపయోగించేవారు. వీటిని ఉపయోగించటం వలన ఎంతో ధృఢంగా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవారు. వేపాకులను ఇన్ఫెక్షన్, అమ్మోరు వంటి అనేక వైద్యాలకు ఉపయోగిస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. వేప నుండి తయారు చేసిన నూనె ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోంది. మరి మన ఆరోగ్యం మరియు అందం యొక్క సంరక్షణ కొరకు వేప చమురు ఎలా ఉపయోగపడుతుందో ఈ వ్యాసం లో వివరంగా తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరూ అందమైన, ఆరోగ్యమైన మెరిసే కురులు పొందాలని ఆరాటపడతారు. అలాంటి అందమైన కేశాలను పొందేందుకు వేప నూనె ఎంతో సహాయ పడుతుంది. మరి వేప నూనెని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

అకాలంలో వెంట్రుకలు నెరవడాన్ని ఆపుతుంది : 

హార్మోన్ల మార్పుల వలన ఏర్పడే తెల్ల జుట్టుని గమనిస్తే వేప నూనెని ఉపయోగించి ఉపశమనం పొందగలరు.

ప్రతి రోజు వేప నూనెని రాయటం అలవాటు చేసుకోండి. ఈ నూనెని రాయటం వలన తెల్ల జుట్టుని నివారించి పోషణ అందిస్తుంది.

స్కాల్ప్ కి పోషణ అందించేందుకు వేప నూనె : 

నీమ్ ఆయిల్ లో మీ స్కాల్ప్ కి పోషణ అందించి కురులు ఆరోగ్యంగా మరియు మృదువుగా పెరగటానికి సహాయపడే ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.

వేప నూనెతో మీ స్కాల్ప్ ని మసాజ్ చేయండి మరియు జుట్టు మొత్తం రాసి రాత్రంతా వదిలేయండి. ఉదయం తేలికపాటు షాంపూతో తల స్నానం చేయండి.

దురద నుండి ఉపశమనం కొరకు వేప నూనె : 

డాండ్రఫ్ వలన స్కాల్ప్ పై దురద మరియు మంట ఏర్పడుతుంది. వేప నూనెని ఉపయోగించి దురద చర్మాన్ని వ్యవహరించడం మంచిది.

వేప చమురును మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి తల స్నానం చేయొచ్చు. లేదా వారానికి రెండు సార్లు రాత్రి పడుకునే ముందు తలపై రాసి ఉదయం తల స్నానం చేయండి. వేపాకుతో తయారు చేసుకునే హెయిర్ ప్యాక్ ని కూడా స్కాల్ప్ మరియు జుట్టు పై రాసి గంట సేపు తరువాత తల స్నానం చేయొచ్చు.

చర్మం, జుట్టు, అందం మరియు ఆరోగ్యం వంటి పలు సమస్యలను నివారించగల సామర్ధ్యం వేపలో ఉంటుంది. అన్ని రకాల సమస్యలను తొలగించేందుకు వేప యొక్క సారాన్ని ఉపయోగించి తయారు చేసే ఉత్పత్తులను కూడా మీరు ఉపయోగించవచ్చు. పై చెప్పినటువంటి ప్రయోగాలకు వేప నూనె లేదా వేపాకు సారాన్ని లేదా వేప ఉత్పత్తులను ఉపయోగించి మంచి ఫలితాలను పొందండి.

https://milletsmagic.blogspot.com/2019/08/amazing-benefits-of-neem-oil-for-hair.html
Subscribe to get more Posts :

3 comments

Write comments
sekhar
AUTHOR
November 25, 2021 at 4:24 AM delete

Very nice article. I read full article its very good information provided in this blog neem oil for haircare

Reply
avatar
sekhar
AUTHOR
November 25, 2021 at 4:24 AM delete

Very nice article. I read full article its very good information provided in this blog neem oil for haircare

Reply
avatar
unknown
AUTHOR
January 27, 2022 at 2:28 AM delete

Nice information thanks for sharing this useful in formation
Bhringraj powder for hair

Reply
avatar