తాజా ఆహార పదార్దాలను ఎట్ల గుర్తు పట్టాలంటే
How to Select Fresh Fruits and Vegetables In Market
How to Select Fresh Fruits and Vegetables In Market
రోజూ మార్కెట్‌కి వెళ్లే వాళ్లు చాలా తక్కువే ఉంటారు. చుట్టుపక్కల వారానికొకసారి జరిగే సంతలో కూరగాయలు పుచ్చులు, మచ్చలు చూసి మంచివి ఏరుకుంటారు. ఆరు రోజులకు సరిపడా సంచిలో నింపుకుంటారు. కానీ, ఇంటికొచ్చినంకనే అసలు సంగతి అర్థమవుతుంది. రెండు రోజులకు కొన్ని వాడిపోతయ్. కొన్ని పనికి రాకుండా ఖరాబ్ అయితయ్. కంటికి ఇంపుగా కనిపించేవన్నీ తాజావి కాదు! మరి ఎలా? అంటే వాటికి కొన్ని గుర్తులున్నయ్. బుట్టలో వేసుకునే ముందు… ఒకసారి పట్టి చూడండి!
How to Select Fresh Fruits and Vegetables In Market |
కూరగాయలు లేకుండా కిచెన్ నడవదు. నాన్‌వెజ్‌కి కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి, తాజా కాయగూరల్ని గుర్తుపట్టడానికి.. కొన్ని గుర్తులు ఉన్నాయి.
- బఠాణీలు రాళ్లలెక్క గట్టిగ కాకుండా, కొంచెం మెత్తగుండాలె. బరక బరకగా కాకుండా పట్టుకుంటే స్మూత్‌గా ఉండాలి. రంగు పచ్చగా ఉండాలి.
- గిచ్చి చూస్తే ఎరుపు రంగులో ఉండాలి. తొక్క మీద పగుళ్లు లేకుంటే అవి తాజా బీట్‌రూట్‌లు.
- క్యాబేజీలు చిన్నగా, గుండ్రంగా ఉండాలి. లావుగా, రకరకాల ఆకారాల్లో ఉండే వాటిని కొనొద్దు.
- కాలీఫ్లవర్‌లో చీలికలు, పగుళ్లు ఉంటే మనకన్నా ముందు క్రిములు, కీటకాలు తిన్నాయని అర్థం. ఆ పగుళ్లు క్రిములు తొలిచిన బాటలు. వాటిగుండానే అవి లోపలికి ప్రవేశిస్తాయి. కొన్నిసార్లు పురుగులు బయటకు కూడా కనపడుతుంటాయి. ఇవన్నీ చూసి కాలీఫ్లవర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
- తాజా క్యారెట్ ముదురు కుంకుమపువ్వు రంగులో ఉంటది. దాని పైపొర గాయాలు లేకుండా.. శుభ్రంగా, క్లియర్‌గా కనిపించాలి. ఇది చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి, మిగతా కాలాల్లో కొంచెం ఎక్కువ పరిశీలించి కొనాలి.
- ఉల్లిగడ్డ పైపొరలు ఎండిపోయి గులాబీ రంగులో ఉండాలి. లోపలి రేకులు గుండ్రంగా, గట్టిగా కనిపిస్తే అవి తాజావి.
- పుట్టగొడుగులు కొంచెం మెత్తగా, గుండ్రంగా, జిడ్డుగా ఉండాలి.
- ఆలుగడ్డలు పట్టుకుంటే గట్టిగా ఉండాలి. పైపొర జిడ్డుగా ఉండాలె. పైన పగుళ్లు ఉండేవి, బయటికి నల్లగా కనిపించేవి, మట్టితో నిండినట్టు, బూడిద పూసినట్టు ఉండేవాటిని కొనకూడదు. మొలకలు వచ్చిన ఆలుగడ్డల్ని కూడా కొనొద్దు.
- పాలకూర ఆకులు నీట్‌గా, మెత్తగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండాలి. పాలకూర కట్టలో పసుపు రంగులోకి మారిన ఆకులున్నా, ఆకులపై రంధ్రాలు పడినా, చీలికలున్నా వాటిని తీసుకోవద్దు.
- కొంచెం లావుగా, గుండ్రంగా, ఎర్రగా నిగనిగలాడుతున్న టొమాటోల్ని తీసుకోవాలి. మచ్చలు, నల్లని పుచ్చులున్న వాటిని తీసుకోవద్దు. మెత్తపడ్డ వాటికి దూరంగా ఉండాలి.
- పచ్చి బీన్స్‌నే తీసుకోవాలి. కొనేటప్పుడు చేత్తో తాకి, గుండ్రంగా ఉన్నాయో లేదో చూడాలి.
- బెండకాయ పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా సన్నటి బెండకాయల్నే ఏరుకోవాలి. పొట్టలు మెత్తగా ఉండాలి. వాటి మీద నల్లని మచ్చలుండకూడదు. తొడిమల్ని వేళ్లతో విరిచి చూడాలి. చటుక్కున విరిగితే లేతవి, తాజావని అర్థం.
- కొత్తిమీర, మెంతికూర ఆకులు చేతికి మెత్తగా తగులుతూ, పచ్చగుండాలి. వాడిపోయినా, పసుపు రంగులోకి మారినా కొనొద్దు. పసుపు రంగులోకి మారిన వాటికి సహజమైన సువాసన ఉండదు. ఎక్కువగా నీటితో తడిపి బరువెక్కిన కట్టల్ని కూడా కొనకూడదు. నీరెక్కువగా ఉండటం వల్ల అవి తొందరగా పాడైపోతాయి. ఇంటికి తెచ్చాక వేర్లు, వాటి మధ్యలో ఉండే గడ్డి తీసేసి, కాగితంలో చుట్టి నిల్వ చేసుకోవాలి.
- కాస్త పెద్ద సైజ్ నిమ్మకాయలనే తీసుకోవాలి. చిన్నవాటిలో రసం ఉండదు.
- నిగనిగలాడే వంకాయలపై.. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. లావుగా ఉన్నాయంటే ముదిరిపోయినట్టే.
- బీరకాయలపై ఉండే అంచులు లేతగా, గిచ్చితే పచ్చిగా ఉంటే తాజావని అర్థం.
https://milletsmagic.blogspot.com/2019/08/how-to-select-fresh-fruits-and.html
how to identify fresh vegetables and fruits in telugu lo how to select fresh fruits and vegetables tips for buying fresh fruits and vegetables factors to consider when choosing vegetables picking fruits and vegetables when selecting fresh vegetables what do you need to do produce vegetables vegetable selections how to identify vegetables in telugu language.